రాయ్ పూర్: ఐఎస్‌ఎస్ అధికారి జిపి సింగ్‌పై చత్తీస్‌ఘడ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో ఇటీవల ఆయన సస్పెండ్ చేశారు.ౖ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి), ఎకనామిక్‌ి అఫెన్స్ వింగ్ (ఇఒడబ్ల్యు) సోదాలు నిర్వహించగా..అక్రమ ఆస్తులు కూడగట్టారని తేలిందని శుక్రవారం అధికారులు తెలిపారు. సోదాల్లో దొరికిన కాగితాల ఆధారంగా ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా కుట్ర పూరిత చర్యలకు పాల్పడుతున్నారని తేలిందని అన్నారు. సోదాలు చేపడుతన్న సమయంలో కొన్ని కాగితాలు చింపేసి, ఇంటి ఆవరణలో పడేయగా, అవి దొరికాయని, అందులో వీరిపై కుట్ర చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెప్పారు. దీంతో ఆయపై ఐపిసిలోని 124-ఎ, 153-ఎ సెక్షన్ల కింద రాయ్ పూర్‌లోని కొత్వాలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామని సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ అజరు యాదవ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. జులై 1 నుండి మూడు రోజుల పాటు ఇటీవల సుమారు 15 చోట్ల ఎసిబి, ఇఒడబ్ల్యు సోదాలు నిర్వహించాయి. మొత్తంగా ఆయన వద్ద 10 కోట్ల విలువ చేసే స్థిర, చర ఆస్తులున్నట్లు గుర్తించారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ జిపి సింగ్, గతంలో ఎసిబిలో అడిషనల్ డైరక్టర్ జనరల్‌గా చేశారు.










