Jul 11,2021 15:32

న్యూఢిల్లీ : తెలంగాణలో నేటి నుంచి ఆషాఢం బోనాల పండుగ ప్రారంభమైంది. దీంతో 'సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు' అంటూ పరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు ప్రబలకుండా, ఇతర సమస్యలు దరిచేరకుండా అమ్మవారిని ప్రార్థించే ఈ బోనాల పండుగ.. ప్రజల ఐకమత్యానికి ప్రతీక అని అభివర్ణించారు. బోనాల పండుగ సందర్భంగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన నిబంధనలను పాటిస్తూ, ఆరోగ్య భారత నిర్మాణంలో మనమంతా భాగస్వాములమవుదాం అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.