ఐఎఫ్‌సి-భోజనాల ప్యాకెట్లు అందిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -కందుకూరు : ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదల కోసం కందుకూరులో ఊరిబయట నిస్స హాయలులైన 40 మంది వృద్ధులు, వికలాంగులను గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు శనివారం అందజేశారు. ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా పేదలకు సహాయం అందిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఫౌండేషన్ సెక్రెటరీ షంషేర్ పేర్కొన్నారు. ప్రెసిడెంట్ సాజిద్, ట్రజరర్ హఫీజ్, ఇన్‌ఛార్జి అయూబ్ ఖాన్ పఠాన్, షంషుద్దీన్ పాల్గొన్నారు.










