- స్ఫూర్తిదాయకంగా ప్రారంభం
- మతోన్మాదులను గద్దెదింపాలి : బృందాకరత్
తిరువనంతపురం : సమైక్యపోరుతోనే సమానత్వ సాధన సాధ్యమవుతుందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పిలుపునిచ్చింది. ఆ సంఘ 13వ జాతీయ మసహసభ తిరువనంతపురంలోని మల్లు స్వరాజ్యం ప్రాంగణంలోనిఎంసి జోసఫీ నగర్‌లో శుక్రవారం ఉత్సాహపూరిత వాతావరణంలో స్ఫూర్తిదాయకంగా ప్రారంభమైనాయి. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన మహిళాసంఘం ప్రతినిధుల హర్షధ్వానాలు, నినాదాల మధ్య జాతీయమహాసభ ప్రారంభమైంది. అంతకుముందు ఉదయం 9.30 గంటలకు ఐద్వా అఖిల భాతర అధ్యక్షులు మాలినీ భట్టాచార్య మల్లు స్వరాజ్యం ప్రాంగణంలో ఐద్వా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిందాబాద్, ఐద్వా లాంగ్‌లివ్ అను నినాదాలు మారుమ్రోగాయి. అనంతరం కేరళ కళామండలి డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్, ప్రముఖ నృత్యకారిణి మల్లికా సారాబాయి జాతీయ మహాసభను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలు ఐక్య పోరాటాల ఆవశ్యక్యతను వివరించారు. మహిళల అణచివేతకు కారణమవుతున్న మనువాదాన్ని ఓడించడానికి మరింత ఉధృతంగా ఐక్యపోరాటాలను నిర్వహించాలని అన్నారు. ప్రారంభోపన్యాసం చేసిన ఐద్వా పూర్వ జాతీయ కార్యదర్శి బృందాకరత్ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన తరువాత ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగానిు కాపాడుకోవడం కోసం పోరాడాల్సిన దుస్థితికి చేరుకున్నామని అన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న హక్కులకు కూడా ప్రస్తుతం ప్రమాదం ఏర్పడిందని అన్నారు. వివిధ పేర్లతో వ్యాపించిన సంఫ్‌ుపరివార్ శక్తులు మనువాదాన్ని సమాజంపై బలంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ కుట్రను ఖచ్చితంగా తిప్పికొట్టాలని, లేనిపక్షంలో మహిళల మనుగడే కష్టంగా మారుతుందనాురు. మతోన్మాదులను గద్దె దించడం ద్వారానే సమానత్వ పోరాటం ముందుకు సాగుతుందని అన్నారు. హక్కులతో పాటు భావి తరాలను పరిరక్షించుకోవడం కోసం ఈ కర్తవ్యానిు మహిళలు తీసుకోక తప్పదని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో మహిళలు చేసిన పోరాటాలను ఆమె ప్రస్తావించారు. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా మహిళాసంఘం కార్యకర్తలు విస్తృతంగా సేవలందించారని చెబుతూ వారికి అభినందనలు తెలిపారు. కేరళ కళామండలి డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ మల్లికా సారాబాయి మాట్లాడుతూ సమాజానిు మార్చాలంటే మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని అన్నారు. ప్రస్తుతం మనువాదం వెనక్కి తీసుకుపోతోందని, కులం, మతం పేరుతో చీలుస్తోందని చెప్పారు. ఈ కుట్రను తిప్పికొట్టడానికి ఐక్యంగా పోరాడాలని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఇష్టమైన తిండి తినడం, ఇష్టమైన బట్ట కట్టడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇది సామూహిక పోరాటం : తీస్తా సెతల్వాద్
'హక్కుల కోసం మనం చేస్తున్న పోరాటం వ్యక్తుల పోరాటం కాదు. సామూహిక పోరాటం. ఏ పోరాటమైనా ఐక్యంగా చేస్తేనే విజయవంతమవుతుంది. ఆ దిశలో ఐద్వా అడుగులు పడుతుండటం మంచి పరిణామం' అని ప్రముఖ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ అనాురు. కోటి మందినిసభ్యులుగా కలిగిఉండటం సామాన్య విషయం కాదన్నారు. ' దేశంలో ఎనిమిదేండ్ల నుండి క్రూరమైన పాలన నడుస్తోంది. నయా ఉదారవాద విధానాలు, మతోన్మాదం వల్ల భారత రాజ్యంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయి. మన వాళ్ళనే మనకు శత్రువుగా మార్చేస్తున్నారు.' అని చెప్పారు. న్యాయ వ్యవస్థను, చట్టాలను కాపాడుకోవడం కోసం గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. తాను హక్కుల కార్యకర్తగానే కాక జరులిస్టుగా కూడా పనిచేస్తున్నానని, అయితే,. మీడియా మొత్తం కార్పొరేటీకరణ అవుతూ పాలకుల పక్షం వహిస్తోందని చెప్పారు. మీడియా తన పాత్ర తాను సరిగ్గా నిర్వహిస్తే ప్రజా ఉద్యమాలకు మరింత బలం వస్తోందని చెప్పారు.
- రేపటి వెలుగుల కోసం ఉద్యమించాలి : ఎలైడా గువేరా
ఐద్వా జాతీయ మహాసభ ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా హాజరైన చే గువేరా కూతరు మానవ హక్కుల కార్యకర్త ఎలైడా గువేరా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలు చేస్తును పోరాటాలు సంఘటితమవుతునాుయనిచెప్పారు. భావి తరాల కోసం రేపటి వెలుగుల కోసం వీటినిమరింత బలోపేతం చేయాలని అనాురు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా ఎనోు పోరాటాలు చేసిందని, ఇంకా చేస్తూనే ఉందనిచెప్పారు. తమ దేశంలో నిర్ణయాధికారాల్లో మహిళల పాత్రను పెంచడానికి ఎంతగానో కృషి చేస్తునుట్లు తెలిపారను. . ప్రస్తుతం క్యూబా పార్లమెంటులో 52శాతం, రాష్ట్ర కౌన్సిల్స్ లో 53శాతం మంది మహిళలు వున్నారని చెప్పారు. అలాగే 4 రాష్ట్రాలకు గవర్నర్లుగా, 12 మంది వైస్ గవర్నర్లుగా, 88 మంది అధ్యక్షులుగా, 58 మంది మేయర్లుగా మహిళలు ఉన్నట్లు తెలిపారు.
- 57 లక్షల సభ్యత్వం..
కేరళలో 57 లక్షల మంది ఐద్వాలో సభ్యులుగా చేరారని, ఇది దేశంలోనే రికార్డని మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు శ్రీమతి అన్నారు. ప్రస్తుతం మహాసభ జరుపుకుంటున్న తిరువనంతపురంలో ఎస్‌ఎఫ్‌ఐ మొట్టమొదటి జాతీయ మహాసభ 1970లో జరిగిందని చెప్పారు. ఈ ప్రాంతానికి చారిత్రాత్మకంగా కూడా ఎంతో గుర్తింపు ఉందన్నారు. ఎల్‌డిఎఫ్ పాలనలో మహిళలు అనిు రంగాల్లో ముందడుగు వేస్తున్నారని, అందువల్లే రెండవసారి కూడా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని ఎనుుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సీనియర్ నాయకులు సుభాషిణి అలి, కేరళ మాజీ వైద్యశాఖ మంత్రి కె.కె సైలజ, జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు వాసుకీ, సుధాసందరరామన్, మల్లు లక్మీ, డి.రమాదేవి, కేరళ రాష్ట్ర అద్యక్ష, కార్యదర్శులు సుసాన్ కోడీ, సి.ఎస్.సుజాత పాల్గొన్నారు.













