ఫొటో : తీసుకోవాల్సిన జాగ్రతలను ప్రజలకు వివరిస్తున్న దృశ్యం
ఐద్వా ఆధ్వర్యంలో కేన్సర్‌పై అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు : కేన్సర్‌పై ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐద్వా మండల అధ్యక్షురాలు మూలి ప్రమీల పేర్కొన్నారు. మర్రిపాడు, ఇస్కపల్లి, రామానాయుడుపల్లి గ్రామాలలో కేన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. కేన్సర్ ఎక్కువగా బయట షాపుల్లో విక్రయించే తినుబండారాలు, పొగాకు, గుట్కాల వల్ల వస్తుందని వాటి వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. జీవితంలో చోటుచేసుకునే ఉ రుకుల పరుగుల జీవితం, జీవన వైవిధ్యాలు కేన్సర్ వ్యాధి బారిన పడేలా చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఐద్వా మహిళా నాయకులు ఖాసింబీ, రమణమ్మ, అంగన్‌వాడీ టీచర్, ఎస్థాని, ఎఎన్‌ఎం రమణమ్మ, ఆశ వర్కర్ సుబ్బమ్మ, మహిళలు పాల్గొన్నారు.










