- పంజాబ్ లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దు అన్నారు. ఈ సందర్భంగా ఆప్ కు శుభాకాంక్షలు తెలిపారు.
- గోవాలో ఆప్ రెండు స్థానాల్లో గెలిచినట్లు పార్టీ నేత అతిషి వెల్లడించారు.
- పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత అమరీందర్ సిింగ్ ఓడిపోయారు. పటియాలా నుండి పోటీ చేసిన ఆయన.. ప్రత్యర్థి , ఆప్ నేత అజిత్ పాల్ సింగ్ చేతిలో ఓటమి చెందారు.
- పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ, ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ ధామి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెనుకంజలో ఉన్నారు.
- ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ... కాంగ్రెస్ డీలాపడింది. గోవా మినహా ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం కనిపించడం లేదు. యుపిలో నాలుగో స్థానానికి కాంగ్రెస్ పరిమితమయింది. పంజాబ్‌లో ఇప్పటికీ 20 సీట్లలో కూడా ఆధిక్యం దక్కలేదు. గోవాలో మాత్రం అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. మణిపూర్‌లో 10 కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్‌లో 20 కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతోంది.
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా... ఉత్తరప్రదేశ్‌లో బిజెపి, పంజాబ్‌లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోన్నాయి. యుపిలో మొత్తం 403 స్థానాలకుగాను అధికార బిజెపి ఇప్పటికే 210 కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలు 110 స్థానాల ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. మొత్తం 117 స్థానాలకుగాను ఇప్పటికే 70 కు పైగా స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 20 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం.
- ఉత్తరప్రదేశ్‌లో బిజెపి హవా
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి హవా కొనసాగుతోంది. అమేఠి జిల్లాల్లోని నాలుగు స్థానాల్లోనూ బిజెపి ఆధిక్యంలో ఉంది. అయోధ్య జిల్లాల్లో ఉన్న 5 స్థానాల్లో బిజెపి 4, ఎస్పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక ఉన్నావ్‌లో బజిఎపి, ఎస్పీలు చెరో మూడు స్థానాల్లో, రారుబరేలిలలో బిజెపి 3, ఎస్పీ 2, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. అంబేద్కర్ నగర్ జిల్లాల్లో 2 ఎస్పీ, 2 బిఎస్‌పి, ఒక స్థానంలో బిజెపి ఆధిక్యంలో ఉంది. - పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది. ఆప్ ఇప్పటికే 65 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం. కాంగ్రెస్ 18, ఎస్‌ఎడి + 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బజిఎపి, ఇతరులు ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
- గోవా మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ విజయం దిశగా దూసుకెళుతున్నారు. ఈ ఎన్నికల్ల్లో ఉత్పల్‌కు బిజెపి టికెట్ నిరాకరించగా.. పనాజీ నుండి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీకి దిగారు.
- వెనుకంజలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి
- పంజాబ్‌లో దూసుకెళుతున్న ఆప్
- యుపిలో బిజెపి, ఎస్‌పి హోరాహరీ
- 2017 లో తమ పార్టీకి చెందిన 10 మంది ఎంఎల్‌ఎలు బిజెపిలోకి ఫిరాయించడంతో గోవా కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
- అయోధ్య, హత్రాస్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్న బిజెపి
- గోవాలో ఆధిక్యంలో కాంగ్రెస్
- పంజాబ్ జలాలాబాద్‌లో అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్
- యుపిలోని కర్తాల్‌లో ఆధిక్యంలో అఖిలేష్
- గోరఖ్‌పూర్‌లో యుపి ముఖ్యమంత్రి యోగి హవా
- పంజాబ్‌లో అమృత్‌సర్ స్థానంలో విజయం దిశగా నవజోత్ సింగ్ సిద్దు
- పటియాలలో వెనుకబడ్డ పంజాబ్‌లోక్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు ప్రారంభమయింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో అధికారులు ఈవిఎం లను తెరిచి ఓట్లను లెక్కిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రజల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.










