రాజంపేట అర్బన్ : ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక కేంద్రాధికారి పి.శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని తిరుపతి రహదారిలో గల గ్రీన్‌పార్క్ అపార్టుమెంట్‌లోని యజమానులకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేసి, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాల సంభవించినప్పుడు ఎలా రక్షించుకోవాలో డెమో నిర్వహించి అవగాహన కల్పించారు. గ్రీన్ పార్క్ అపార్ట్‌మెంట్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు 08565 240299, 99634 79554 నెంబర్లను సంప్రదించి సమాచారం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో అగ్ని మాపక సిబ్బంది బి.సత్యరాజు, బి.సి.ఆర్‌సుబ్రహ్మణ్యం, పి.రవీంద్రబాబు, శివయ్య, సి.నాగూర్ బాష, కె.రాజేష్, జె.శివ శంకర్, సి.రవీంద్ర బాబు, జి.చక్రవర్తి, యు.రాజన్న పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్ : అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కేంద్ర అగ్నిమాపక అధికారి కే.మాబుసుభాన్ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ చేసి మార్కెట్ వద్ద అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి చైతన్యం కల్పించారు. ఏదైనా ప్రమాదం జరిగిన ఎడల అగ్నిమాపక కేంద్రమునకు సమాచారము అందించాలని తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పి.ఆనంద్ లీడింగ్, ఎస్.అబ్దుల్ అమిత్, రెడ్డి శేఖర్, ఎండి.మురళి, ఎస్.చిన్నబాబు , పి.రాజేంద్ర పాల్గొన్నారు. పీలేరు : మన పరిసరాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా వాటిని నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని జిల్లా అగ్నిమాపక అధికారి అనిల్ కుమార్ తెలిపారు. అగ్నిమాపక అధికారి డి. సుబ్బరాజు ఆధ్వర్యంలో ఆదివారం పీలేరు-కడప మార్గంలోని శ్రీదుర్గా అపార్ట్‌మెంట్‌లో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్ర మంలో స్థానిక దుర్గా గ్యాస్ ఏజెన్సీ బి.అమరేంద్ర నాయక్ హాజరయ్యారు. లక్కిరెడ్డిపల్లి : జిజి రాచపల్లి ప్రజలకు అగ్ని ప్రమాదాల గురించి అగ్నిమాపక అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్ని ప్రమాదాల పట్లఅప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కార్య క్రమా నిలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జెసి బాల హుస్సేన్ పాల్గొన్నారు. ములకలచెరువు : ప్రతి ఒక్కరు అగ్నిమాపక సేవలు వినియోగించుకోవాలని అగ్నిమాపక లీడింగ్ పైర్ మ్యాన్ కష్ణయ్య అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక ఉమాశంకర్ కాలనీలో గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది కష్ణయ్య, గణేష్‌కుమార్, వీరభద్ర రెడ్డి పాల్గొన్నారు.వాల్మీకిపురం: అగ్ని ప్రమాదాల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక తిరుపతి రోడ్డులోని ఇందిరమ్మకాలనీలో మహిళలకు అగ్నిమాపక అధికారులు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మంటలను ఏ విధంగా ఆర్పాలి తదితర వాటిపై అవగాహన కల్పించారు. అదే విధంగా వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా గ్యాస్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని మహిళలు గ్యాస్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు అపార్ట్‌మెంట్లలో జరిగే ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బహుళ అంతస్తుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను సురక్షితంగా ఎలా తీసుకొస్తారనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది బాబయ్య, శ్రీనివాసులు, రాజగోపాల్ నాయక్, కిరణ్‌బాబు, రవి, ఇమ్రాన్, చైతన్య, శివశంకర్, భాస్కర్ పాల్గొన్నారు.










