బురదమయమైన గ్రామీణ రహదారి
ప్రజాశక్తి - చిలమత్తూరు : మండూస్ తుఫాన్ దాటికి మండల పరిధిలోని చిన్నన్నపల్లి,మధురేపల్లి,ఎస్ ముదిరెడ్డిపల్లి,దోర్నాలపల్లి గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాలకు వెల్లే రహదారులతో పాటు,గ్రామల్లోని వీధుల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇక పాఠశాలలకు వెల్లే విధ్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు కేజీబీవీ పాఠశాల ముందు ప్రాంతం బురదమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.










