ప్రజాశక్తి-ఓబుళదేవరచెరువు మండలంలోని అధికా రులు బాధ్యతగా విధులు నిర్వహించా లని జడ్పిటిసి కుర్లి దామోదర్‌రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ పోలప్ప ఆధ్వర్యంలో ఎంపిపి తుమ్మల పర్వీన్ భాను అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ సిఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల మన్ననలు పొందాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎంపిపి తుమ్మల పర్వీన్‌భాను మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వం అందించే పథకాలను గ్రామస్థాయిలో ఎంపిటిసిలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులకు వివరించి సంపూర్ణంగా ప్రజలకు చేరవేయడానికి అధికారులు చిత్తశుద్ధిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీధర్, ఎంఇఒ ఖాదర్ వలిబాషా, విద్యుత్ శాఖ ఎఇ రామసూరారెడ్డి, వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, హౌసింగ్ ఎఇ హరిప్రసాద్‌రెడ్డి, అగ్రికల్చర్ ఎఒ ఇలియాజ్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ జయమ్మ, ఐకెపి ఎపిఎం రమణప్ప, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీనివాసులు, సర్పంచులు ముద్దలపల్లి గోవింద్, జగన్మోహన్‌చౌదరి, రంగారెడ్డి, వెంకటరమణ, రామచంద్రారెడ్డి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు, నాయకులు










