సంవత్సరం తప్పుగా ముద్రించిన అభ్యర్థుల జాబితా
ప్రజాశక్తి-హిందూపురం : పశ్చిమ రాయలసీమ పట్టుభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు 2023వ సంవత్సరంలో జరుగుతున్నాయి. అయితే అధికారుల పర్యవేక్షణా లోపం వల్ల 2013లో జరుగుతున్నట్లు బ్యాలెట్ నమూన పత్రాలలో ముద్రించారు. దీనిని గమనించకుండా పోలింగ్ అధికారులు సోమవారం జరిగిన ఎన్నికల్లో వారి పోలింగ్‌కేంద్రాల ముందు ఏర్పాటు చేసిన బ్యాలెట్ నమూనా పత్రాలలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు 2013 అంటూ ముద్రించిన పత్రాలను అతికించారు. దీనిపై కొంత మంది ఫిర్యాదు చేయడంతో అధికారులు పెన్నుతో సరిచేశారు. రాజ్యాంగ బద్దంగా జరిగే ఎన్నికల్లో అధికారులు ఇంత నిర్లక్ష్యంగ వ్యవహరించడంపై పట్టుభద్రులు, ఉపాధ్యాయులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.










