మాట్లాడుతున్న మాజీ ఎంఎల్‌ఎ
అధికార పార్టీపై తీవ్ర అసంతప్తి
ప్రజాశక్తి-అల్లూరు:అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర అసంతప్తి వ్యక్తమవుతుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 29వ తేదీన కావలికి విచ్చేస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నియోజకవర్గానికి తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి విచ్చేస్తున్నారన్నారు. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు గ్రావెల్ దందా, మట్టి మాఫియా, భూ కబ్జాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎస్‌సి, ఎస్‌టిలకు రావలసిన రాయితీలను దారి మళ్లించి మొక్కుబడిగా అమ్మఒడి అంటూ ఒకరో ఇద్దరికీ ఇచ్చి మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవిచంద్ర నాయకత్వంలో అందరు పనిచేయాలని కోరారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయదుంబి ది మోగించి అందరు కషి చేయాలన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీద గిరిధర్, బండి శ్రీనివాసులు రెడ్డి, మాజీ సర్పంచ్ అనురాధ, బుల్లా కష్ణారెడ్డి, అంబటి రాజేంద్ర పాల్గొన్నారు.










