ప్రజాశక్తి-నందిగామ(ఎన్‌టిఆర్) : అధిక ధరలు, పన్నుల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం నందిగామ పట్టణంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ కేంద్రం విధించిన సెస్సులు రద్దు చేయాలని, ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల, నాయకులు సయ్యద్ ఖాసిం, కర్రి వెంకటేశ్వరరావు, ఎవినారాయణ తదితరులు పాల్గొన్నారు.










