ఆధారాలు అందించాలి
ప్రజాశక్తి-ఎఎస్‌పేట : ఎఎస్‌పేట దర్గా మాజీ సజ్జాదా అఫిష్ పాషాపై వచ్చిన అభియోగాలపై ఇరు పక్షాలు తవవద్ద ఉన్న ఆధారాలను అందించాలని విచారణ అధికారి ఎకె నజీర్‌సాహెబ్ కోరారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆధారాల కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత హఫీజ్ తన వద్దనున్న ఆధారాలను విచారణ అధికారికి అందించారు. అనంతరం ఐద్యా జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్‌బీ ఐద్వా కమిటీ మెంబర్లతో కలిసి విచారణ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా మస్తాన్‌బీ మాట్లాడుతూ దర్గా, ఎఎస్‌పేటలో యాత్రికులకు మహిళలకు రక్షణ కల్పించాలని తెలిపారు. అనంతరం అవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి రషీద్, జిల్లా రైతు సంఘం కార్యదర్శి మూలి వెంగయ్య, గంట లక్ష్మిపతితో కలిసి విచారణ అధికారిని కలిసి పలు ఆధారాలను అందించారు. అనంతరం మండల సిపిఎం కార్యదర్శి అస్లామ్, గౌష్ బాషాతో కలసి ఎఎస్‌పేటలో జరిగిన సంఘటనల గురించి పలు ఆధారాలను అందించారు. హఫీజ్‌కు సంబంధించిన స్థానికతపై ఆధారాలను విచారణ అధికారికి అందించినట్లు గౌస్‌బాషా తెలిపారు. కార్యక్రమంలో ఎఎస్‌పేట అవాజ్ కమిటీ కార్యదర్శి నిసార్ అహ్మద్, షేక్ సంశాద్, షేక్ ఎస్థాని, గుడిపాడు సిపిఎం నాయకుడు వేణుగోపాల రెడ్డి, శ్యామలమ్మ, గ్రామ ముస్లీం నాయకులు తదితరులు పాల్గొన్నారు. విచారణ అధికారి మాట్లాడుతూ దర్గాకు సంబంధించిన జమ ఖర్చుల వివరాలను హఫీజ్ అందించలేదని తెలిపారు.










