May 24,2023 22:00

ఫొటో : అధికారులతో మాట్లాడుతున్న డి ఎల్‌ డి ఒ కనకదుర్గ భవాని

ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి
ప్రజాశక్తి-అల్లూరు : ఆధార్‌ అప్డేట్‌ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకోవాలని డిఎల్‌డిఒ కనకదుర్గ భవాని వెల్లడించారు. బుధవారం మండల కేంద్రం స్థానిక సచివాలయం -2లో ఏర్పాటుచేసిన ఆధార్‌ అప్డేట్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఆశా వర్కర్లు నిర్వహించాల్సిన విధులపై చర్చించి పలు సలహాలు సూచనలు అందజేశారు.
అలాగే ఆయుష్మాన్‌ భారత్‌ తదితర వాటి ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌ ఫణి కుమార్‌, పంచాయతీ కార్యదర్శులు వరప్రసాద్‌, పెనుగొండయ్య, ఏపిఎం ప్రసాద్‌ వీఆర్‌ఓ కరిముల్లా తదితరులున్నారు.