అడవుల సంరక్షణ అందరీ బాధ్యత
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని భావితరాలకు అడవులే రక్ష అని ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి కె.రామకొండారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో రామ కొండారెడ్డి అధ్యక్షతన సిబ్బందికి వన సంరక్షణ సమితి (విఎస్‌ఎస్) సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజర్ రామకొండారెడ్డి మాట్లాడుతూ అడవికి నిప్పు అటవీ సంపదను కొల్లగొడుతున్న అడవులకు నిప్పు ప్రగతికి ముప్పు అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లోని అటవీ సంరక్షణ కోసం ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అడవికి నిప్పు పెడుతున్న వారిని గుర్తించి సమాచారం ఇవ్వాలని, అడవికి నష్టం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని సూచించారు. గ్రామాలకు దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడాల్సిస్తున్న బాధ్యత ఆయా గ్రామస్తులు విఎస్‌ఎస్ సభ్యులపై ఉందన్నారు. సంరక్షణ వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి దొరుకుతుందని తద్వారా అడవి సంరక్షణ కాపాడగలుగుతామని తెలిపారు. రేంజ్ పరిధిలో 6 హెక్టార్లో నూతన ప్లాంటేషన్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. యకలిప్టస్కు గిట్టుబాటు ధర లేకపోవడంతో భవిష్యత్తులో ఆ మొక్కల స్థానంలో ఉసిరి నేరేడు తదితర పండ్ల జాతి మొక్కలను విఎస్‌ఎస్‌ల ఆధ్వర్యంలో చెంచునున్నట్లు దీనివల్ల వారికి ఉపాధి దొరకడంతో పాటు నాణ్యమైన తలసాయం అందుతుందని జంతువులకు ఆహారం లభిస్తుందని విశ్వకర్మంగా తెలియజేశారు. 1079 హెక్టార్లతో ప్రస్తుత పక్వానికి వచ్చిన యుకలిప్టస్ను వేలం ద్వారా విక్రయించి అనంతరం ఆ భూముల్లో పండ్ల జాతి మొక్కలను పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. పలు ప్రభుత్వ శాఖల సహకారంతో సంఘం సోమశిల ప్రాజెక్టు ప్రాంతాల్లో ఎకో టూరిజం రూ.4 కోట్ల అంచనాలతో రూపొందిస్తున్నట్లు ఇందులో భాగంగా సంఘం కొండ ప్రాంతాల్లో అనేక ఔషధ మొక్కలను పెంపకం చేస్తున్నట్లు తెలిపారు. అటవీ చట్టాలను గురించి లీగల్ అడ్వైజర్ విజరుకుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒలు పిచ్చిరెడ్డి, రవి, ఖాజా రహమతుల్లా, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పెంచల నరసయ్య, వాగాల శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.










