రాయచోటి టౌన్ : రాజీవ్ స్వగృహను ఆదర్శ టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని రాజీవ్ స్వగృహలో రూ 3.81 కోట్ల అంచనా నిధులుతో సిసి రోడ్లు, మౌలిక వసతుల నిర్మాణాలకు జరిగిన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల వ్యవధిలో ఈ పనులను పూర్తి చేయాలని అధికారులును ఆదేశించారు. రాజీవ్ స్వగృహలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులుతోనూ, గృహ యజమానులుతోనూ కూలంకుశంగా చర్చించారు. సుమారు రూ.4 కోట్ల నిధులుతో పార్క్, పాత రోడ్డు రెన్యూవల్, సుందరీకరణ పనులను కూడా చేపడతామని తెలిపారు. 57 ఏకరాలలోవున్న లే అవుట్‌ను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 147 ప్లాట్లు, పాతవి 7 ప్లాట్లను వేలం వేయాల్సిఉందన్నారు. అటు జిల్లా కలెక్టరేట్, ఇటు ఎస్‌పి కార్యాలయం మధ్యలో రాజీవ్ స్వగృహ శ్రీకాంత్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి చెందుతుండడంపై రాజీవ్ స్వగృహ ఆనంద నిలయం గృహ యాజమానుల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, జడ్‌పిటిసి వెంకటేశ్వరరెడ్డి, బిసి నాయకులు పల్లపు రమేష్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, కో-ఆప్షన్ అయ్యవారురెడ్డి, కాంట్రాక్టర్ చలమారెడ్డి పాల్గొన్నారు.










