Jun 14,2023 21:06

ఇంటింటికి నల్లారి కార్యక్రమంలో కిషోర్‌కుమార్‌రెడ్డి

కలికిరి : ఆదరించండి నియోజకవర్గాన్ని మరింత అభివద్ధి చేసి చూపిస్తా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ప్రజలను కోరారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఇంటిం టికీ నల్లారి కార్యక్రమం బుధవారం నాలుగో రోజున కలికిరి పట్టణంలోని కట్ట కిందపాలెం, కొత్తపేట, టీబి రోడ్‌, టెలిఫోన్‌ ఎక్సెంజ్‌ కాలనీలో నిర్వహించారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ప్రజలకు వివరించారు. టిడిపి అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాసం, రూ.3వేలు నిరుద్యోగ భతి, 18 సంవత్సరాల నిండిన మహిళలకు నెలకు రూ.1500లు, రైతులకు రూ.20వేలు ఆర్థిక సహాయం, మహిళలకు సంవత్సరానికి మూడు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు వంటి ప్రజా సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్రాన్ని మరింత అభివద్ధి పథంలో తీసుకెళ్తామని అన్నారు. నియోజకవర్గంలో పరి శ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, అనేక అభివద్ధి కార్యక్రమాలు జరిగేటట్లు చర్యలు తీసుకుంటానని వారికి హామీ నిచ్చారు.కార్యక్రమంలో మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ రెడ్డివారి ప్రతాప్‌కు మార్‌రెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు నిజాముద్దీన్‌, ఉపాధ్యక్షుడు రెడ్డపురెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌, టీ షాప్‌ బుజ్జి, 203బూత్‌ కమిటీ కన్వీనర్‌ వైజాగ్‌బాషా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.