Jul 13,2021 19:57

అమరావతి : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నీటిని వచ్చినట్లు పవర్‌ జనరేషన్‌ కోసం అడ్డగోలుగా లాగేసుకుంటే దీనిపై చంద్రబాబు ఒకమాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాంతాలు, జిల్లాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి, టిడిపికి మధ్య లోపాయికారీ సంబంధం ఉందా అనే అనుమానులున్నాయని అన్నారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన సిఎంగా పనిచేశారా అన్న అనుమానం వస్తోందని అన్నారు. పంచాయితీల గొంతు నొక్కింది చంద్రబాబేనని విమర్శించారు. ఆయన హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్నారని విమర్శించారు.