'అదాని' అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ దేశ ప్రజల ఆస్తులు కార్పొరేట్ కంపెనీలు స్వాహా
కడప అర్బన్ : దేశ ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపె నీలకు తాకట్టు పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం కంక ణం కట్టుకుందని, అదాని గ్రూప్ అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ. గఫూర్ తెలిపారు. బుధవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో విస్తత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగి పోతుండడంతో ప్రజల జీవనో పాధిపై నిరంతరం దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా ఈనెల 22 నుంచి 28 వరకు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను నిర్వహి స్తున్నట్లు పేర్కొన్నారు. 40 శాతానికి పైగా ప్రజల సంపదంతా కేవలం ఒక్క శాతం మంది దగ్గర పోగు పడిందని చెప్పారు. శతకోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 166కు చేరిందని తెలిపారు. ఉపాధి అవకా శాలు సష్టించే మౌలిక వసతులపై ప్రభుత్వ పెట్టు బడులు పెరగాలని కోరారు. ఆదానీ సామ్రాజ్యం కుప్ప కూలిపోతుందని, రూ.10 లక్షల కోట్లు ఆవిరి అయిపో యిందని పేర్కొన్నారు. రూ.18 వేల కోట్ల ఎల్‌ఐసి షేర్లు దివాలా తీయించారని, ప్రజల సొమ్మును, ఆదానికి దోచి పెట్టారని తెలిపారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల పైన భారం మోపారని విమర్శించారు. అవుట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగులకు, స్కీం వర్కర్లకు వేతనాల పెంచలేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాటం ద్వారా సాధిం చుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు కోడులుగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారన్నారు. ఎనిమిది గంటల పనిని 12 గంటలకు చేశారని, సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును లేకుండా చేస్తున్నారని వాపోయారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా, పనిముట్లు ఎరువులు ధరలు పెంచారన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశాన్ని కేంద్రంలో మతోన్మాద బిజెపి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి మత రాజ్యాలుగా మార్చాలని ప్రయత్నిస్తుందని తెలిపారు. మత రాజ్యాల్లో అభివద్ధి కాలేదని చెప్పారు. ఏ మతం జోక్యం లేకుండా లౌకిక దేశంగా ఉండాలని కోరారు. వామపక్షాలు తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని, నిర్వర్యం చేస్తున్నారని ఆందో ళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో నిధులు కోత విధిస్తు న్నారని, ఉపాధి కూలి రూ.600 పెంచాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని, పట్టణాలకు విస్తరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల ప్రయివేట్‌పరం చేయటం, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి స్మార్ట్ మీటర్లు పెట్టడం, రైతులు, ప్రజల పైన భారాల మోపడం కోసం అన్నారు. కార్మిక రైతు, కూలి వ్యతిరేక విధానాలకు, నిరసనగా ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాల అమలు చేస్తున్నారని విమర్శించారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని తెలిపారు. మతోన్మాద బిజెపి నుంచి దేశాన్ని రక్షించడానికి సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామమోహన్, మనోహర్, శివకుమార్, బి.నారాయణ, ఐ.ఎన్. సుబ్బమ్మ, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, సత్యనారాయణ చారి, దస్తగిరి రెడ్డి, పాపిరెడ్డి, అన్వేష్, లక్ష్మీదేవి, జిల్లా నాయకులు భైరవ ప్రసాద్, చంద్రారెడ్డి, శివకుమార్, ఓబులేష్, సునీల్ కుమార్, గోపాలకష్ణయ్య, వెంకటేష్, సుబ్బరాయుడు, మహబూబ్ తార, వివిధ మండలాల నుంచి శాఖ కార్యదర్శిలు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.










