ఆచార్య ఉగ్రాణం చంద్రశేఖర్ రెడ్డికి అభినందనలు
క్యాంపస్ : తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక అధికారిగా ఆచార్య ఉగ్రాణం చంద్రశేఖర్ రెడ్డి సోమవారం శ్వేత భవనంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన ఒక సంవత్సర కాలం పాటు ప్రత్యేక అధికారి హౌదాలో ఆయన ఎపిక్ స్టడీస్ లో కొనసాగుతారు. ఉగ్రాణం చంద్రశేఖర్ రెడ్డి ఎస్వీయూ తెలుగు అధ్యయన శాఖల 30 సంవత్సరాలుగా అధ్యాపకులుగా, యూనివర్సిటీలో వివిధ హౌదాల్లో పనిచేశారు. ఆయన 10 గ్రంథాలను రచించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అనేక పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఎస్వియూ మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య పి. నరసింహారెడ్డి, తెలుగు అకాడమీ డైరెక్టర్లు ఆచార్య జే. ప్రతాప్ రెడ్డి, పేట శ్రీనివాస్ రెడ్డిపుష్పగుచ్చం, దుశ్శాలువలతో అభినందనలు తెలిపారు.
ఉగ్రాణం చంద్రశేఖర్‌రెడ్డిని అభినందిస్తున్న ఆచార్యులు










