మదనపల్లె అర్బన్: ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింతో చర్యకు సిద్దమా పాపాల పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు. శుక్రవారం 40వ రోజు స్థానిక దేవతానగర్ నుండి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా సుందర్య సర్కిల్, బెంగళూరు బస్టాండ్, అనిబిసెంట్ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకుని అక్కడ ఎన్టీర్ విగ్రహానికి పూలమాలలు వేసి సాదయాత్ర కొనసాగించి. సాయంత్రం స్థానిక అమ్మిచెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ మిథున్‌రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరి హయాంలో జిల్లా అభివృద్ది చెందిందో చర్చకు నేను సిద్దం, శనివారం తంబళ్లపల్లెలో ఉంటా మిథున్‌రెడ్డి వస్తే చర్చకు నేను సిద్దమని పేర్కొన్నారు. టిడిపి హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు కల్పించింది, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది టిడిపినేనన్నారు. ల్యాండ్, సాండ్, వైన్, మైన్ మాఫియాలు తెచ్చింది పాపాల పెద్దిరెడ్డి కుటుంబమని ఆరోపించారు. నాలుగేళ్లలో పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంది రూ.10 వేల కోట్లన్నారు. మదనపల్లికి కంపెనీలు రాకపోవడానికి పెద్దిరెడ్డి కుటుంబమే కారణమన్నారు. జగన్ సీన్ అయిపోయిందని, రాబోయేది టిడిపి ప్రభుత్వమని రాష్ట్రాన్ని అభివృద్ది చేసేది తామేనని పేర్కొన్నారు. మదనపల్లిలో అధికారిక ఎమ్మెల్యే నవాజ్‌బాషా, అనధికార ఎమ్మెల్యేలు పాపాల పెద్దిరెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి. తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో చేసిన లారీలతో ఇక్కడ కొండలను తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారని అరోపించారు. దళితులకు చెందిన టికెటి భూములు లాక్కుని మైనింగ్ చేస్తున్నారని, ఎమ్మెల్యే నవాజ్ బాషా తన బినామీలతో బెంగళూరు బస్టాండ్ పరిధిలోని షాపింక్ కాంప్లెక్స్ నుండి రూ.ఐదు లక్షలు వసూలు చేస్తూ సొంతానికి వాడుకుంటున్నారన్నారు. 557 ఎకరాలు ఉన్న సిటిఎం చెరువును స్థానిక ఎమ్మెల్యే, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి అనుచులు 30 ఎకరాలు కాజేశారని, కరోనా వస్తే షాపులు, రెస్టారెంట్లు, బంగారం కొట్ల నుండి రూ.4 కోట్లు వసూలు చేశారన్నారు. జిల్లా పెద్దరెడ్డి కుటుంబం చేతిలో ఉండాలని మదనపల్లిని జిల్లా కాకుండా అడ్డుకున్నారని, చర్చకు నేను సిద్దమని,. ప్రజల తరపున నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజలకు హామీ ఇస్తున్నా..పీలేరు, మదనపల్లి, పుంగనూరును కలిపి ఆరునెలల్లోనే జిల్లా చేస్తానని, మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉంటుందన్నారు. మదనపల్లిలో పెండింగులో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేస్తామని, హంద్రీనీవా కాలువలోని 59వ ప్యాకేజ్, చిప్పిలి, గుంటువారిపల్లి ఎస్‌ఎస్ ట్యాంక్ నిర్మాణాలకు రూ.180 కోట్లు మంజూరు చేశామన్నారు. మీరు చూపిన ప్రేమ, ఆదరణ, గౌరవం మర్చిపోలేను. మదనపల్లిలో అడుగుపెట్టినప్పుటినుండి నాకు ఘన స్వాగతం పలికి ఆశీర్వదించారు. మదనపల్లికి పరిశ్రమలు రాకపోవడానికి కారణం పెద్దిరెడ్డి కుటుంబమేని, వాళ్ల కుటుంబాన్ని తరిమికొట్టండన్నారు. మదనపల్లిలో వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని తెలిపారు. పోరాటాలకు పుట్టినిల్లు మదనపల్లి అని స్వాతంత్య్రం కోసం గాంధీ మదనపల్లి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారని, 500 కి.మీ మైలు రాయిని దాటింది ఈ మదనపల్లెలోనే అది నా అదష్టమని పేర్కొన్నారు.
టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా నారా లోకేష్ సమక్షంలో టిడిపిపార్టీలో చేరారు. లోకేష్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దొమ్మలపాటి రమేష్, షాజహాన్ బాషా ఇద్దరూ సమన్వయంతో మదనపల్లిని టిడిపికి కంచుకోటగా మార్చాలని ఆకాంక్షించారు.










