ప్రజాశక్తి-భవానీపురం : విద్యాధరపురం ఎన్ కన్వెన్షన్‌లో పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసిపి ప్లీనరీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ ప్లినరీ పరిశీలకులు డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ముఖ్య నేతలు మాట్లాడుతూ అర్హత ఉన్న అందరికీ ఇళ్లు కేటాయించిన ఘనత వైసిపిదేనన్నారు. వైసిపి పాలనలో విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీలు ఎండి రుహుల్లా, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, వసంత కృష్ణప్రసాద్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-జగ్గయ్యపేట టౌన్: స్థానిక ఎస్‌జిఎస్ కళాశాల ప్రాంగణంలో వైసిపి ప్లీనరీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జి డొక్కా మాణిక్యవరప్రసాద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ నియోజకవర్గ యువనాయకులు వెంకట కృష్ణప్రసాద్ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.










