May 23,2023 20:47

సచివాలయం ప్రారంభోత్సవంలో ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌

సంబేపల్లె(రాయచోటి) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డ్‌ సచివాలయ వ్యవస్థ చారిత్రాత్మకంగా నిలుస్తోందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. మంగళవారం సంబేపల్లె మండలం అంకిరెడ్డిగారిపల్లెలో నూతనంగా ఒకే ప్రాంగణంలో నిర్మించిన గ్రామ సచివాలయం, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల నూతన భవనాలను ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ ప్రజల ముంగిటకే సేవలు అందిస్తూ భరోసానిస్తోందన్నారు. సచివాలయ అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అమలవుచున్న సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. నియోజక వర్గంలో 73 సచివాలయాలుకు గాను 60 సచివాలయాలకు భవన నిర్మాణాలు పూర్తయ్యయాయని, 42 రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తయ్యాయని, 60 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ లకు గాను 28 భవన నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమరనాధ్‌రెడ్డి మాట్లాడుతూ సచివాలయ అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల మన్ననలును పొందాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలను తిప్పుకోకుండా పనులును చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డిసిఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిదంబర్‌రెడ్డి, రాష్ట్ర పోక్స్‌ అండ్‌ క్రియేటివిటీ డైరెక్టర్‌ ఉదరు కుమార్‌రెడ్డి, గాలివీడు ఎంపిపి జల్లా సుదర్శన్‌ రెడ్డి, సంబేపల్లె మండల వైస్‌ ఎంపిపి పొత్తూరి రవీంద్ర నాయుడు, సర్పంచ్‌ పాల వెంకట రమణ నాయుడు, డాక్టర్‌ కిషోర్‌రెడ్డి, తహశీల్దార్‌ మహేశ్వరి భాయి, ఎంపిడిఒ నరసింహులు, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ వడ్డీ వెంకట రమణారెడ్డి, కౌన్సిలర్‌ ఆసీఫ్‌ అలీఖాన్‌, మండల వ్యవసాయ సలహా సంఘ అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, సర్పంచులు గుది అనసూయమ్మ,, మోటకట్ల అమరనాధరెడ్డి, రఘునాథరెడ్డి, దండు నాగభూషన్‌రెడ్డి, నూర్‌ అహమ్మద్‌, ఎంపిటిసిలు భద్రయ్య, మీసాల ఆంజనేయులు, కాకులపల్లె రమణారెడ్డి, మాజీ సర్పంచ్‌లు బట్టా ప్రభాకర్‌ నాయుడు, అమీర్‌, రాళ్లపల్లె రవీంద్ర నాయుడు, నాయకులు పెద్దయ్య, అన్నారెడ్డి, గొల్లపల్లె సుబ్బారెడ్డి, వసంత శ్రీనివాసులు రెడ్డి, వంగిమళ్ల వేణుగోపాల్‌ రెడ్డి, మోటకట్ల ప్రతాప్‌రెడ్డి, శెట్టిపల్లె లక్ష్మీకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, పాల్గొన్నారు.