ఫొటో : మాట్లాడుతున్న ఎంపిటిసి కాకు విజయ
అభివృద్ధి శూన్యం : ఎంపిటిసి ఆగ్రహం
ప్రజాశక్తి-ఉదయగిరి : పాలకులు మారిన ఉదయగిరి అభివృద్ధి శూన్యంగా ఉందని ఎంపిటిసి కాకు విజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఉదయగిరి బిజ్జంపల్లి ఘాట్ రోడ్డును పూర్తి చేయాలని, అన్నంపల్లి బ్రిడ్జిని నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పసుపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలు కనీస మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య, సిపిఎం నాయకులు పందిళ్ల వెంకటేశ్వర్లు,పెంచలయ్య ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










