Jan 07,2023 21:49

ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ షేక్‌ మస్తాన్‌వలీ

అభివృద్ధి ప్రణాళికలను పూర్తి చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : 8, 9 తేదీల్లో జరగనున్న గ్రామసభలలో పాఠశాల అభివృద్ధికి అవసరమైన వాటిని గుర్తించి పాఠశాల అభివృద్ధి ప్రణాళికలను పూర్తి చేయాలని ఎంఇఒ షేక్‌ మస్తాన్‌ వలీ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని యాదవపాలెం, నాగులబావివీధి పాఠశాలలను ఆయన సందర్శించి ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ కాంప్లెక్స్‌ స్థాయిలో జరుగుతున్న పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, ఆవాస ప్రాంత ప్రణాళిక శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంఇఒ మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధికి అవసరమైన వాటిని గుర్తించి 8, 9 తేదీల్లో జరగనున్న గ్రామసభలలో చర్చించి పాఠశాల అభివృద్ధి ఆవాస ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్‌ కాంప్లెక్స్‌ చైర్మన్‌ షేక్‌ గౌస్‌ బాషా, ప్రాథమిక ఉన్నత పాఠశాల బిసి ఉర్థూ కాంప్లెక్స్‌ చైర్మన్‌ షేక్‌ అరాఫత్‌, కార్యదర్శి షేక్‌.నసురుల్లా, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.