May 03,2023 21:28

ఫొటో : పనులు పరిశీలిస్తున్న ఎంపిడిఒ శ్రీనివాసులు

అభివృద్ధి పనులు పరిశీలన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని మహిమలురు, రామస్వామిపల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను బుధవారం ఎంపిడిఒ సి.శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మహిమాలురు, రామస్వామిపల్లి సచివాలయాలను తనిఖీ చేసి సంబందిత రికార్డులను పరిశీలించారు. అలాగే మహిమలూరులో రూ.21లక్షలతో నిర్మస్తున్న రైతు భరోసా, రూ.17 లక్షలతో నిర్మిస్తున్న బల్క్‌ మిల్క్‌ కేంద్ర నిర్మాణ పనులను, నాడు-నేడు కింద ఉర్థూ పాఠశాలలో రూ.12లక్షలతో నిర్మస్తున్న మెయిన్‌ గేట్‌, ఇతర నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే రామస్వామిపల్లిలో రూ.35లక్షలతో నిర్మిస్తున్న సచివాలయం భవనం, 21లక్షల రైతు భరోసా నిర్మాణ పనులను పరిశీలించారు.
సిమెంట్‌ లేని కారణంగా ప్రస్తుతం పనులు అగి ఉన్నవని మెటీరియల్‌ అందుబాటులోకి రాగానే పనులను ప్రారంభిస్తామని భవన కాంట్రాక్టర్‌ తెలియజేశారు. నాడు-నేడు కింద రూ.5లక్షలతో నిర్మిస్తున్న అంగన్‌వాడీ స్కూలు నిర్మితమవుతున్న కిచెన్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు భాస్కర్‌, కార్తిక్‌, ఇంజనీరింగ్‌ సహాయకులు రఘు, ప్రసాద్‌, వి.ఆర్‌.ఒ. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.