అభివృద్ధి పనులపై సమీక్ష
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలో జరగాల్సిన అభివృద్ధి పనులపై సర్వసభ్య సమావేశంలో అన్ని విభాగాల ఉద్యోగులతో ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపిపి మూలే పద్మజ వినరు రెడ్డి అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సమావేశంలో వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో పలు అభివృద్ధికి పనులపై ఆయాశాఖల అధికారులతో సమీక్షించారు. చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అనంతరం బండగానిపల్లి పంచాయతీ ఎంపిటిసి కాకు విజయ సమస్యలు వినాలంటూ బైఠాయించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డిఇ నరసింహ, జిల్లా కోఆప్షన్ సభ్యులు గాజుల తాజుద్దీన్, ఉపాధ్యక్షురాలు మట్ల శాంతి, ఎంపిటిసిలు గొల్లపల్లి తిరుపతయ్య, సుభహాన్, మండల కోఆప్షన్ సభ్యులు సుభాని, సర్పంచులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.










