ప్రజాశక్తి పులివెందుల టౌన్: పట్టణ పరిధిలో రూ.124.10 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. రూ.65 లక్షలతో అభివృద్ధి, సుందరీకరణ చేసిన విజయ హోమ్ జంక్షన్, రూ.75.00 లక్షలతో కదిరి జంక్షన్, రూ.676 లక్షల వ్యయంతో 100 అడుగులకు విస్తరించిన కదిరి రోడ్డు, రూ.120 లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్, 429.50 లక్షల పాడా నిధులతో నిర్మించిన వైఎస్‌ఆర్ మెమోరియల్ పార్క్, మైత్రి లేఅవుట్, రూ.870 లక్షలతో రాయలాపురం వద్ద నిర్మించిన నాలుగు లేన్ల బ్రిడ్జి, రూ.22.40 కోట్ల పాడా నిధులతో ఆధునాతనంగా నిర్మించిన పులివెందుల ఎపిఎస్ ఆర్‌టిసి బస్టాండు, రూ.14.60 కోట్లతో నిర్మించిన అహోబిలం నూతన మోడల్ ప్రభుత్వ హైస్కూలు, రూ.225 లక్షల సిఎస్‌ఆర్. నిధులతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి, అభివృద్ధి చేసిన ప్లే గ్రౌండ్, రూ.50 కోట్ల ఎంఎ, యుడి నిధులతో రోటరీపురం వద్ద నిర్మించిన 10 ఎంఎల్‌డి. ఎస్‌టిపి, రూ.12.50 కోట్లతో పూర్తి యాంత్రీకరణతో నడిచే గార్బేజ్ ట్రాన్స్‌ఫార్మర్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆర్‌టిసి చైర్మన్ మాలికార్జున్‌రెడ్డి, కలెక్టర్ వి.విజరు రామరాజు, జిసి సాయికాంత్ వర్మ, ఎస్‌పి కెకెఎన్ అన్బురాజన్, పాడా ఒఎస్‌డి అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ ఇన్‌ఛార్జి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










