Feb 20,2023 22:12

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ :  జిల్లాలో వారంలోగా అభివద్ధి పనుల్లో పురోగతి కనిపించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి గహ నిర్మాణాలు , నాడు నేడు, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు, సచివాలయ సేవలపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లు, గహ నిర్మాణ శాఖ డిఇలు, ఎఇలు తదితర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సామూహిక గహప్రవేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం ఉండగా జిల్లాకు సంబంధించి జగనన్న లే అవుట్‌ లలో 10,600 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సుందన్నారు. అయితే ఇప్పటివరకు 4150 పూర్తి అయ్యాయని మరో 6450 ఇళ్ళు పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయి ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు పూర్తిస్థాయిలో సమాచారం లేదని వారి వద్ద పూర్తి సమాచారం ఉండాలని అన్నారు. నాడు నేడు క్రింద పాఠశాలల్లో చేపట్టిన అభివద్ధి పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ తదితర భవనాలు ఇంకా చేపట్టలేదని ఎందుకు మొదలు పెట్టలేదో తనకు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలతో డేటాను ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలన్నారు. కేటాయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అభివద్ధి సాధించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గహ నిర్మాణ శాఖ పిడి చంద్రమౌళి రెడ్డి, పంచాయితీ రాజ్‌ ఇ ఇ మురళీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.