Mar 27,2023 21:49

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో చేపడుతున్న అభివృద్ది పనుల్లో పురోగతి చూపించాలని, పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమంలో 190 అర్జీలను స్వీకరించిన కలెక్టర్‌ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని అధికారులతో అభివృద్ధి పనులు, పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, డ్వామా పీడీ రామాంజనేయులు, పిఆర్‌ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు నాలుగు 104 సంచార వైద్యశాలల వాహనాలు
జిల్లాకు నూతనంగా నాలుగు సంచార వైద్యశాలల వాహనాలు మంజూరు కాగా ఆ వాహనాలను కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్‌ నూతన సంచార వైద్యశాలల ను ప్రారంభించిన కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ వైద్యశాలలతో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ కృష్ణారెడ్డి, 104 జిల్లా నోడల్‌ అధికారి సెల్వియా, జిల్లా మేనేజరు శంకర్‌, ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ రామకృష్ణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.