హరారే: వన్డేల్లో జింబాబ్వే జట్టు రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం గ్రూప్-ఏ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు అమెరికాపై ఏకంగా 304పరుగుల తేడాతో గెలిచి ఈ రికార్డును నమోదు చేసింది. వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్లలో జింబాబ్వే రెండోస్థానంలో నిలిచింది. తొలిస్థానంలో ఇండియా 317పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గి ప్రథమస్థానంలో ఉంది. ఇక జింబాబ్వే జట్టు వన్డేల్లో 304పరుగుల తేడాతో గెలుపొందడం ఇదే ప్రథమం. హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 408పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. కెప్టెన్ విలియమ్సన్(174) భారీ శతకానికి తోడు ఓపెనర్ గుంబే(78) అర్ధసెంచరీతో మెరిసాడు. పరాడ్కర్‌కు మూడు, జెస్సీ సింగ్‌కు రెండు, కెంజిజేకు ఒక వికెట్ దక్కాయి. ఛేదనలో అమెరికా జట్టు 25.1 ఓవర్లలో 104పరుగులకు ఆలౌటైంది. అభిషేక్(24) టాప్ స్కోరర్. రిచర్డ్స్, సికిందర్ రాజాకు రెండేసి, ఎర్విన్, జోంగ్వే, రియాన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విలియమ్సన్‌కు లభించింది.
వన్డేల్లో భారీ విజయాలు..
317 : ఇండియా; శ్రీలంకపై, తిరువనంపురం(2023)
304 : జింబాబ్వే; అమెరికాపై, హరారే(2023)
290 : న్యూజిలాండ్; ఐర్లాండ్‌పై, అబెర్డెన్, 2008
నెదర్లాండ్స్‌కు 'సూపర్' విజయం

మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు సూపర్ ఓవర్‌లో వెస్టిండీస్ జట్టుకు ఝలక్ ఇచ్చింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు 6వికెట్ల నష్టానికి 374పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో భాగంగా నెదర్లాండ్స్ జట్టు కూడా నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యేసరికి 9వికెట్లు కోల్పోయి 374పరుగులు చేసింది. హోల్డర్ వేసిన సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ జట్టు 6బంతుల్లో 30పరుగులు చేయగా.. నెదర్ల్లాండ్స్ బౌలర్ వాన్ బీక్ వేసిన ఓవర్లో వెస్టిండీస్ జట్టు 8పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు 22పరుగుల తేడాతో గెలిచి గ్రూప్-ఏలో రెండోస్థానంలో నిలిచి సూపర్-6కు క్వాలిఫై అయ్యింది. 29నుంచి సూపర్-6 పోటీలు ప్రారంభం కానున్నాయి. సూపర్-6లో ప్రతి జట్టు ఐదేసి మ్యాచ్‌లు ఆడి అగ్రస్థానంలో నిలిచిన రెండుజట్లు ఫైనల్లో తలపడనున్నాయి. ఆ రెండుజట్లు భారత్‌వేదికగా జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించనున్నాయి.










