Jul 14,2023 11:59

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌ వెస్టిండీస్‌పై 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా యశస్వి జైస్వాల్‌ ఆరెంగేట్రంలోనే అదరగొట్టాడు. 143 పరుగులతో నాట్‌ అవుట్‌గా నిలిచాడు. 350 బంతుల్లో జైస్వాల్‌.. 143 పరుగులు చేశాడు. అరంగేట్రం టెస్టులోనే యశస్వి జైస్వాల్‌ సెంచరీ కొట్టి దూసుకుపోతూ రికార్డుల మూత మోగించాడు. టీమిండియా తరఫున డెబ్యూ టెస్ట్‌లో సెంచరీ బాదిన 17వ ఆటగాడిగా మూడవ ఓపెనర్‌గా నిలిచాడు. అంతకుముందు 2016లో శిఖర్‌ ధావన్‌, 2018లో పథ్వీ షా ఈ రికార్డును సాధించారు. కాగా, యశస్వి జైస్వాల్‌ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. విదేశాల్లో అరంగేట్రం చేసిన టెస్టులోనే సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు కొట్టాడు.