- ఆరంగేట్రం ఇరానీట్రోఫీలోనే డబుల్ సెంచరీ
గ్వాలియర్: యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరంగేట్రం ఇరానీట్రోఫీలోనే డబుల్ సెంచరీని కొట్టి రికార్డు నెలకొల్పాడు. ఇరానీ ట్రోఫీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న యశస్వి.. రంజీట్రోఫీ ఛాంపియన్ మధ్యప్రదేశ్‌తో జరిగిన ఇరానీ ట్రోఫీలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా జట్టు 3వికెట్ల నష్టానికి ........ పరుగులు చేసింది. ముంబయి చెందిన యువ బ్యాటర్ రెడ్‌బాల్ క్రికెట్‌లో చెన్నై వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే నార్త్‌జోన్‌పై 227పరుగులు చేసిన జైస్వాల్.. ఆ తర్వాత ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌పై గత ఏడాది జరిగిన కాక్స్ బజార్‌లో సెంచరీతో (146పరుగులు) కదం తొక్కాడు. అలాగే కేవలం 17 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగులు 2022-23 సీజన్‌లో చేశాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో జైస్వాల్ వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు ఇంతకుముందు రూసీ మోడీ, అమోల్ మజుందార్(13 ఇన్నింగ్స్) రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు. దీంతో రెస్టాఫ్ ఇండియా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 381పరుగులు చేసింది. మొత్తమ్మీద 259బంతులను ఎదుర్కొన్న జైస్వాల్.. 213పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.










