Jun 21,2023 21:40
  • చివరి బంతికి స్కాట్లాండ్‌ చేతిలో ఓటమి

హరారే: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ మ్యాచుల్లో ఐర్లాండ్‌ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. బుధవారం జరిగిన గ్రూప్‌-బి లీగ్‌ పోటీలో స్కాట్లాండ్‌ జట్టు చివరి బంతికి ఫోర్‌ కొట్టి ఐర్లాండ్‌పై సంచలన విజయం నమోదు చేసుకుంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ జట్టు 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 286పరుగులు చేసింది. క్యాంపర్‌(120) సెంచరీకి తోడు డాక్రెల్‌(69) అర్ధసెంచరీతో మెరిసాడు. స్కాట్లాండ్‌ బౌలర్‌ మెక్‌ ముల్లెన్‌కు ఐదు వికెట్లు దక్కాయి. ఛేదనలో స్కాట్లాండష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 289పరుగులు చేసి గెలిచింది. చివరి ఓవర్లో విజయానికి 8పరుగులు చేయాల్సిన స్కాట్లాండష్ట్ర తొలి రెండు బంతుల్లో 5పరుగులు రాబట్టింది. ఆ తర్వాత షరీఫ్‌ వికెట్‌ను కోల్పోయి. ఆ తర్వాతి 2బంతులకు ఒక్క పరుగే చేయగల్గింది. ఆ దశలో చివరి బంతికి లీస్క్‌(91) ఫోర్‌ కొట్టి స్కాట్లాండ్‌ను గెలిపించాడు. ఐర్లాండ్‌ బౌలర్లు అడైర్‌కు మూడు, లిట్టిల్‌, డాక్రెల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.

  • ఓమన్‌ ఖాతాలో రెండో గెలుపు

గ్రూప్‌-బిలో ఓమన్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఓమన్‌ జట్టు 5వికెట్ల తేడాతో యుఏఇని చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన యుఏఇ నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 227పరుగులు చేయగా.. ఛేదనలో ఓమన్‌ జట్టు 46ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 228పరుగులు చేసి గెలిచింది. దీంతో గ్రూప్‌-బిలో ఓమన్‌ జట్టు 4పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 23న జరిగే శ్రీలంకను చిత్తుచేస్తే.. ప్రధాన టోర్నీకి చేరువ కానుంది.