Jul 11,2023 16:44

భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు ప్రపంచకప్‌ జరగనుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఆక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది. వన్డే ప్రపంచకప్‌ 2023 భారత్‌లోని పది వేదికల్లో జరగనుంది. ఇందులో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ కూడా ఉంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో 5 లీగ్‌ మ్యాచ్‌లతో పాటు సెమీ ఫైనల్‌ 2 కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్‌ ధరలను క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) వెల్లడించింది. ఈడెన్‌ మైదానంలో జరిగే అన్ని మ్యాచ్‌ల ధరలు రూ. 650 నుంచి రూ. 3000 వరకు ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌ టిక్కెట్‌ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  • నెదర్లాండ్స్‌ - బంగ్లాదేశ్‌ (అక్టోబర్‌ 28): టికెట్‌ ప్రారంభ ధర రూ. 650 (అప్పర్‌ టైర్స్‌). డి, హెచ్‌ బ్లాక్‌లు రూ. 1000. బీ, సీ, కే, ఎల్‌ బ్లాక్‌లు రూ. 1500
  • భారత్‌ - దక్షిణాఫ్రికా మ్యాచ్‌, సెమీస్‌: అప్పర్‌ టైర్‌ రూ. 900. డీ, హెచ్‌ బ్లాక్‌లు రూ. 1,500. సీ, కే బ్లాక్‌లు రూ. 2,500. బీ, ఎల్‌ బ్లాక్‌లు రూ. 3,000.
  • బంగ్లాదేశ్‌ - పాక్‌, ఇంగ్లాండ్‌-పాక్‌ (నవంబర్‌ 12) పాక్‌ మ్యాచ్‌లు: రూ. 800 (అప్పర్‌ టైర్‌). డీ, హెచ్‌ బ్లాక్‌లు రూ. 1,200. సీ, కే బ్లాక్‌లు రూ. 2000. బీ, ఎల్‌ బ్లాక్‌లు రూ. 2,200.