Feb 10,2023 11:19
  • సమిష్టిగా రాణిస్తే.. కప్‌ మనదే..

జొహాన్స్‌బర్గ్‌ : ఐసిసి వన్డే ప్రపంచ కప్‌లో రెండుసార్లు.. టి20 ప్రపంచ కప్‌లో ఒకసారి రన్నరప్‌గా నిలిచిన భారత మహిళలజట్టు ఈసారి టైటిల్‌ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌ను గెలిచిన ఉత్సాహంలో ఉన్న భారతజట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటర్స్‌ క్రీజ్‌లో నిలదొక్కుకుంటే సుదీర్ఘ నిరీక్షణకు తెరదించడం ఖాయం. టి20 ప్రపంచకప్‌ను గెలిచే చక్కని అవకాశం భారత్‌కు ఇప్పుడు వచ్చింది. బలాలను, బలహీనతలను బేరీజు వేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో సాగితే కప్పు కల సాకరమైనట్లే! ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌ ఆతిథ్య దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభం కానుండగా.. భారతజట్టు తన తొలి లీగ్‌ మ్యాచ్‌ను ఆదివారం పాకిస్తాన్‌తో తలపడనుంది.