Mar 09,2023 17:24

హిందూపురం : బార్‌ అసోసియేషన్‌ మహిళా విభాగాన్ని గురువారం అదనపు జిల్లా జడ్జి శైలజ ప్రారంభించారు. స్థానిక కోర్టు ఆవరణలో ఉన్న భవనాన్ని మహిళా న్యాయవాదుల కోసం ఏ డి జె కే టాయించారు. దీంతో ఆ భవనాన్ని ప్రత్యేకంగా రూపుదిద్దడంతో ఏ డీజే తో పాటు న్యాయమూర్తులు శ్రీధర్‌ రాజ్యలక్ష్మి ఆనంద తీర్థ సుకుమార్‌ లు ప్రారంభించారు. న్యాయమూర్తులు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం ఏ డి జె కోర్ట్‌ ఆవరణలో శైలజ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సమస్యల పరిష్కారానికి ఆత్మస్థర్యంతో ముందుకెళ్లాలని ఆమె మహిళా న్యాయవాదులు ఉద్యోగిలకు సూచించారు భాగంగా న్యాయవాదులు మహిళా ఉద్యోగులను సన్మానించి బహుమతులు అందజేశారు ఆయా కార్యక్రమాల్లో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగప్ప ఏపీపి ఇందాద్‌ ఏజిపి శ్రీనివాస్‌ రెడ్డి మహిళా న్యాయవాదులు కళావతి రత్నమ్మ సంతోషి కుమారి నవేరా వందన పవిత్ర అంజనమ్మ తదితరులు పాల్గొన్నారు