Sep 25,2023 11:36

తెలంగాణ : ఈనెల 27వ తేదీలోపు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రకటించారు. న్యూఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్యే ఆ పార్టీ పెద్దల సమక్షంలో ఈ నెల 27 లోపు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. మెదక్‌లో తన కుమారుడికి మంచి ఆదరణ ఉందని.. సర్వేలో అనుకూలంగా ఉంటే ఇద్దరికీ టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు ఎమ్మెల్యేతో చెప్పినట్లు వివరించారు. తన తరఫున నక్క ప్రభాకర్‌కు కూడా మేడ్చల్‌ టికెట్‌ అడిగినట్లు మైనంపల్లి తెలిపారు.