Oct 17,2023 10:41

రాజమండ్రి : '' పార్టీ శ్రేణులు తనను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది ? '' అని నారా భువనేశ్వరి మంగళవారం ట్వీట్‌ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నప్పటి నుండి ఆయన భార్య భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటూ నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో... ఆయా ప్రాంతాల నుండి టిడిపి శ్రేణులు భువనేశ్వరి వద్దకు వెళుతూ సంఘీభావం తెలుపుతున్నారు. టిడిపి శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న నేపథ్యంలో ... భువనేశ్వరి ఈరోజు ట్వీట్‌ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా ... రాజమండ్రిలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పేముంది ? అని భువనేశ్వరి ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. - '' చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది. నాకు మనోధైర్యం కోసం పార్టీ శ్రేణులు యాత్ర చేపడితే తప్పేముంది. పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్లు.. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తారా ? నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది '' అని ప్రశ్నిస్తూ భువనేశ్వరి ట్వీట్‌ చేశారు.

-