శంషాబాద్ (హైదరాబాద్) : హైదరాబాద్- దుబారు విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు దుండగుల నుండి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. కాసేపట్లో ఆ విమానం రన్‌వే పైనుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా, వెంటనే ఆ విమానాన్ని ఆపేశారు. ప్రయాణికుల లగేజీలను జాగ్రత్తగా తనిఖీలు చేశారు. ప్రయాణీకుల్లో ... తిరుపతి, వినోద్, రాకేశ్ అనే ముగ్గురూ దుబారు మీదుగా ఇరాక్ వెళుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ తరువాత విమానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులను మరో విమానంలో దుబారుకు పంపించనున్నట్లు తెలిపారు.










