న్యూఢిల్లీ : హాస్పిటలిటీ టెక్నలాజీ ప్లాట్‌ఫాం ఓయో 2023 డిసెంబర్ ముగింపు నాటికి కొత్తగా 1000 హోటళ్లను జోడించనున్నట్లు తెలిపింది. అక్సలేరేటర్ ప్రోగ్రామ్ కింద మరింత విస్తరణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న యాజమానుల సహకారం తీసుకోనున్నట్లు పేర్కొంది. మార్చిలో ఈ ప్రోగ్రామ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 300 హోటళ్లను చేర్చుకున్నట్లు ఓయో చీఫ్ మర్చంట్ ఆఫీసర్ అనుజ్ తేజ్‌పాల్ తెలిపారు. కొత్త మార్కెట్లకు విస్తరించడానికి రూ.10 కోట్ల వ్యయం చేయనున్నామన్నారు.










