విజయవాడ: రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణను తప్పనిసరిగా కోరుతామని ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ప్రతిరోజు మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనధికారింగా వైసిపి నాయకుల జేబుల్లోకి భారీ మొత్తాలు వెళ్తున్నాయనే విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పురందేశ్వరి మాట్లాడారు.ప.గో. జిల్లా నరసాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని గురువారం తాను తనిఖీ చేయగా, అక్రమాలు బయటపడ్డాయన్నారు. రూ.లక్ష వరకు ఆ సమయానికి విక్రయాలు జరిగితే.. అందులో డిజిటల్ చెల్లింపులు జరిపింది కేవలం రూ.700 మాత్రమేనని తమ పరిశీలనలో తేలిందని వివరించారు.










