లండన్: యాషెస్ సిరీస్ రెండోటెస్ట్‌లోనూ ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగిస్తోంది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 83 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(66), స్మిత్(85), హెడ్(77) అర్ధసెంచరీలతో మెరిసారు. తొలిటెస్ట్ హీరో ఉస్మాన్ ఖవాజా(17)తో కలిసి డేవిడ్ వార్నర్ తొలి వికెట్‌కు 73పరుగులు జతచేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ వెంట వెంటనే ఔటైనా.. లబూషేన్-స్టీవ్ స్మిత్ కలిసి ఆసీస్‌ను ఆదుకున్నారు. అర్ధసెంచరీకి దగ్గర్లో 47 పరుగుల వద్ద లబూషేన్‌ను రాబిన్సన్ ఔట్ చేశాడు.తొలి రోజును గొప్పగా ముగించేలా కనిపించిన ఆసీస్‌కు రూట్ షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో హెడ్, గ్రీన్ (0)లను ఔట్ చేశాడు. ఆ తర్వాత కేరీతో కలిసి స్మిత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. రెండోటెస్ట్ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం కురవడంతో మ్యాచ్ కొంతసేపు నిలిచిపోయింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 339/5 (వార్నర్ 66, ఖవాజా 17, లబుషేన్ 47, స్టీవ్ స్మిత్ 85 బ్యాటింగ్, హెడ్ 77, గ్రీన్ 0, కేరీ 11 బ్యాటింగ్; జోష్ టంగ్ 2/88, జో రూట్ 2/19)










