May 22,2023 21:51
  •  రాష్ట్ర విజేతగా జిల్లా బాల, బాలికల జట్లు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రెండు రోజులుగా విజయనగరం కస్పా హైస్కూల్‌ మైదానంలో జరిగిన అండర్‌-19 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో విజయనగరం జిల్లా బాల బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో విజయనగరం విజేతగా నిలవగా తూర్పు గోదావరి జట్టు రెండో స్థానంలో, విశాఖ జట్టు మూడో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో విజయనగరం విజయం సాధించగా, ద్వితీయ, తృతీయ స్థానాలను ప్రకాశం, విశాఖ జట్లు కైవశం చేసుకున్నాయి. విజేతలకు విజయనగరం డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, సెట్విజ్‌ సిఇఒ రామ్‌ గోపాల్‌ బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో రాణించి రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేయాలని అతిథులు ఆకాక్షించారు. అనంతరం జాతీయ పోటీలకు ప్రాపబుల్స్‌తో కూడిన జట్టును ఎంపిక చేశారు.

2