హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై శుక్రవారం సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు వైసిపి ఎంపి అవినాష్‌రెడ్డి, మిగతా నిందితులు హాజరయ్యారు. విచారణ తరువాత న్యాయస్థానం వచ్చేనెల 4కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ... వివేకా హత్య కేసుకు సంబంధించి ఎస్కార్ట్ బెయిల్ పొందిన నిందితుడు వైఎస్ భాస్కర్‌రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనారోగ్యం కారణంగా ... భాస్కర్ రెడ్డికి 12 రోజులపాటు సిబిఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన అనంతరం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి భాస్కర్‌రెడ్డి వెళ్లారు. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని భాస్కర్ రెడ్డిని న్యాయస్థానం ఆదేశించిన సంగతి విదితమే.










