Oct 16,2023 11:58

విజయవాడ : దసరా వేడుకల వేళ ... ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. సోమవారం గాయత్రీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. క్యూలైన్ల నిర్వహణను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్‌ రద్దీ లేకుండా వాహనాలను ఇతర మార్గాలకు మళ్లించారు. పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు.