Sep 24,2023 15:58

సిరికొండ :ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలోనే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన కాపు ముట్టడి కాపు సంఘం సభ్యులు, మల్లాపూర్‌ గ్రామానికి చెందిన తొమ్మిది బీజేపీ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ తెలంగాణ అభివఅద్ధి, సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం గొప్పగా పరిపాలన అందిస్తుందని, ప్రభుత్వ ప్రగతిశీల ఆలోచనా విధానానికి తామంతా ఆకర్షితులమై బీఆర్‌ఎస్‌లో చేరినట్లు పేర్కొన్నారు.అనంతరం బాజిరెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనిక పాలనతో ప్రతి పల్లెకూ అభివఅద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో బాల్‌రెడ్డి, శ్రీకాంత్‌, డీ నారాయణ, నరసయ్య, పీ సందీప్‌ రెడ్డి, టీ గంగాధర్‌, నరేందర్‌ రెడ్డి, శివారెడ్డి, సంతోష్‌ రెడ్డి, అనిల్‌ రెడ్డి, నగేశ్‌రెడ్డి, గంగారెడ్డి, రాజు, ఎన్‌ నరసయ్య, ఎన్‌ లక్ష్మణ్‌, సురేష్‌, దర్శనం శేఖర్‌, కలిగోట్‌ గంగాధర్‌, సట్ల ఆశన్న, రోలం భూమయ్య, మల్లయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ ఉన్నారు.