Jul 04,2023 16:42

జెనీవా : వాతావరణ మార్పుల ఫలితంగా రాబోయే రోజుల్లో లక్షలాది మంది ప్రజఝఝ కరువు బారినపడే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్‌ వోల్కర్‌ టర్క్‌ హెచ్చరించారు. జూలై 14 వరకు జరగనున్న మానవ హక్కుల మండలి 43వ సెషన్‌ సమావేశాల్లో వోల్కర్‌ సోమవారం మాట్లాడుతూ.. 'వాతావరణం మార్పు వల్ల ఈ శతాబ్దం మధ్య నాటికి దాదాపు 80 మిలియన్ల మంది ప్రజలను కరువు గురిచేస్తుందని అంచనా వేయబడింది. 2021లో 828 మిలియన్ల ప్రజలు ఆకలితో అలమటించార'ని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన 'మన పర్యావరణం మండుతోంది... కరిగిపోతోంది.. ఎండిపోతోంది. వరదలు వంటివి సంభవిస్తున్నాయి. జీవరాశిలోని పక్షులు, జంతువులు చనిపోతున్నాయి. భవిష్యత్తులో ఎదురయ్యే విపత్తును ఎదుర్కోవడానికి పర్యావరణ మార్పులకు సంబంధించి విధాన రూపకర్తలు తక్షణమే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. విపరీతమైన వాతావరణ పరిస్థితులు పంటలు, పశువులు, పర్యావరణ వ్యవస్థలపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని, దీంతో ప్రపంచ ఆహార లభ్యతపై ఆందోళన పెరుగుతుందని వోల్కర్‌ అన్నారు. భవిష్యత్తులో చిన్నారులకు ఆకలి బాధ లేకుండా చేయడం మన చేతుల్లోనే ఉందని టర్క్‌ అన్నారు. అయితే వాతావరణ మార్పులను తగ్గించే విధానాలకు అనుగుణంగా ప్రపంచ నేతలు లేరని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.