May 09,2023 10:05

దుబాయ్ : దైవ దూషణకు పాల్పడ్డారని పేర్కొంటూ ఇద్దరు వ్యక్తులను ఇరాన్‌ ప్రభుత్వం ఉరి తీసిందని అధికారులు తెలిపారు. ఈఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు 203 మంది ఖైదీలను ఉరితీసిందని ఇరాన్‌ మానవ హక్కుల గ్రూపు పేర్కొంది. సెంట్రల్‌ ఇరాన్‌లోని ఆరక్‌ జైల్లో యూసుఫ్‌ మెహ్రాద్‌, సద్‌రోలా ఫాజెల్‌ జరేలను ఉరి తీశారు. 2020 మేలో వారిని అరెస్టు చేశారు.