Sep 21,2023 16:15

తెలంగాణ : రాగల రెండురోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మరో వైపు గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్‌(టీ)లో 11.3 సెంటీమీటర్ల వర్షాపాతం కురిసింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, ములుగు, వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిన్నటి నుంచి గురువారం ఉదయం వరకు రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాపాతం రికార్డయ్యింది. అత్యధికంగా ఎల్లారెడ్డిపేటలో 9 సెంటీమీటర్ల వర్షాపాతం టీఎస్‌డీపీఎస్‌ వివరించింది.